హైదరాబాద్‌లో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. మలక్ పేటలో ఈ ఘటన చోటు చేసుకుంది. శాలివాహననగర్ పార్క్ లో వాకింగ్ చేస్తున్న చందూ నాయక్ అనే వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో చందూ నాయక్ అక్కడిక్కడే మృతి చెందాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. భూ వివాదమే ఈ దారుణానికి కారణమని అనుమానిస్తున్నారు.