సైదాబాద్: గృహిణి అనుమానాస్పద మృతి

ఓ గృహిణి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు వెంకటేశ్- అనుష్క (23) దంపతులు శంకేశ్వర బజార్లో నివసిస్తున్నారు. బుధవారం అనుష్క ఇంట్లో ఉరి వేసుకుంది. భర్త హాస్పిటల్ కు తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళుతుండగా సైదాబాద్ పోలీసులకు సమాచారం అందింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్