మలక్ పేట్: విజేతలను అభినందించిన ఎమ్మెల్యే

విద్యార్థులు క్రీడల పట్ల తగిన శ్రద్ధ తీసుకోవాలని మలక్ పేట్ ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల అన్నారు. ఇటీవల కేవీబిఆర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన నేషనల్ ఇన్విటేషనల్ ఓపెన్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్ షిప్ లో మలక్ పేటకు చెందిన విద్యార్థులు పాల్గొని 3 బంగారు పథకాలు, 3 రజత పథకాలు సాధించారు. బుధవారం విజేతలు ఎమ్మెల్యేను కలిశారు. ఎమ్మెల్యే వారందరిని అభినందించి మరిన్ని పథకాలు సాధించాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్