మలక్ పేట్: పాతబస్తీలో తనిఖీలు నిర్వహించిన పోలీసులు

హైదరాబాద్ లో పోలీసులు అప్రమత్తమయ్యారు. శుక్రవారం పాతబస్తీ పరిధిలోని బార్కాస్ సలాలలో తనిఖీలు నిర్వహించారు. ప్రతి ఒక్క వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. శాంతి భద్రతలకు భంగం కలగకుండా పోలీసుశాఖకు సహకరించాలని కోరారు. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్