కీసరగుట్టలో కోతుల దాడి: భక్తులు, స్థానికుల్లో భయాందోళన

మేడ్చల్ జిల్లా కీసరగుట్టలో కోతుల బెడద తీవ్రమైంది. ఆలయ పరిసరాలు, జనావాసాల్లో కోతుల దాడులు పెరిగిపోవడంతో స్థానికులు, భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల ఒక కోతి దూకుడుగా వ్యవహరిస్తూ పలువురిపై దాడి చేసింది. ఈ ఘటనలో అఖిల్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి, అతనికి 12 కుట్లు పడ్డాయి. ఆలయ సిబ్బంది ఆంజనేయులు, పూజారి వెంకటేష్ స్వల్ప గాయాలతో ప్రథమ చికిత్స పొందారు. కోతుల దాడులు నిత్యకృత్యంగా మారాయని, ఇది ఆలయ ప్రతిష్టకు, పర్యాటక అభివృద్ధికి ఆటంకంగా మారుతుందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్