ముసారాంబాగ్: రోడ్డు పనులు ప్రారంభించిన కార్పొరేటర్

ముసారాంబాగ్ డివిజన్ పరిధిలోని బస్తీ వాటర్ ట్యాంక్ వద్ద రోడ్డు పనులు శనివారం ప్రారంభమయ్యాయి. పనులను స్థానిక కార్పొరేటర్ బొక్క భాగ్యలక్ష్మి ప్రారంభించారు. ఎన్నో ఏళ్లుగా రోడ్డు లేక స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. దీంతో అధికారులతో మాట్లాడి నిధులు మంజూరు చేయించామని వెల్లడించారు. లెవెల్స్ సరిగ్గా చూసుకుంటూ పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు సూచించారు.

సంబంధిత పోస్ట్