ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ యువతకు ప్రాణాంతకం: రవి రాజ్ రాథోడ్

ఆన్‌లైన్ గేమింగ్ బెట్టింగ్ యాప్స్ యువత ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయని ఎన్‌బీఎంఐ మెడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా అధ్యక్షుడు రవి రాజ్ రాథోడ్ అన్నారు. సులభంగా డబ్బు వస్తుందన్న మాయలో పడిన యువత ఆర్థికంగా, మానసికంగా నష్టపోతున్నారని, బెట్టింగ్ యాప్స్ కారణంగా అప్పులు, కుటుంబ సమస్యలు, ఆత్మహత్యలు పెరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమ బెట్టింగ్ యాప్స్‌పై కఠిన చర్యలు తీసుకుని, యువత భవిష్యత్తును కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్