పోలియో చుక్కలు ప్రతి చిన్నారికి తప్పనిసరి

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 129వ డివిజన్ సూరారం కాలనీ శివాలయ నగర్‌లో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పాల్గొన్నారు. ఆయన చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తూ, ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. "నిండైన ఆరోగ్యకరమైన జీవితానికి రెండు చుక్కలు ఎంతో అవసరం" అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, డివిజన్ అధ్యక్షుడు పుప్పాల భాస్కర్, జనరల్ సెక్రటరీ సిద్దిక్, బీఆర్ఎస్ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్