న్యూ ఇయర్, సంక్రాంతి పండుగలను దృష్టిలో ఉంచుకుని సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీని అంచనా వేస్తూ, తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ ట్రావెల్ ఆపరేటర్లు అధిక ధరలు వసూలు చేస్తున్న నేపథ్యంలో, ఆర్టీసీ బస్సుల్లో టికెట్ బుకింగ్ కోసం ప్రయాణికులు ఆసక్తి చూపుతున్నారు. పండుగల సమయంలో ప్రైవేట్ ఆపరేటర్లకు పోటీగా ఆఫర్లు ప్రకటించే ఆర్టీసీ, ఇప్పుడు బస్సుల్లో టికెట్ల ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాన్ని మరింత మెరుగుపర్చింది.