హిందూ శ్మశానవాటిక సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేక చొరవ చూపుతున్నామని ముసారాంబాగ్ కార్పొరేటర్ భాగ్యలక్ష్మి తెలిపారు. డివిజన్ పరిధిలోని అరోరా కాలేజీ వద్ద ఉన్న హిందూ శ్మశానవాటికను కార్పొరేటర్ సందర్శించారు. ఇటీవల నూతనంగా వీధిలైట్లు ఏర్పాటు చేయించామని తెలిపారు. శ్మశానవాటికలో ఇతర మౌలిక వసతులకు సంబంధించి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.