ముసారాంబాగ్ సిగ్మా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, గ్రీన్ పిల్డ్ పారామెడికల్ కాలేజీ ఎదుట బాధిత విద్యార్థులతో కలిసి టీజీవీపీ కార్యకర్తలు గురువారం ధర్నా చేపట్టారు. సిగ్మా కాలేజీకి తెలంగాణ ప్రభుత్వ అనుమతి లేదని మలక్ పేట్ ఏరియా ఇన్‌చార్జ్ వంశీ ఆరోపించారు. వెంటనే కాలేజీని మూసివేసి విద్యార్థులను ఇతర గుర్తింపు పొందిన కాలేజీలకు బదిలీ చేయాలని డిమాండ్ చేశారు.