టీపీసీసీ కొత్త కార్యవర్గంలో వీలైనంత ఎక్కువ మందికి అవకాశాలివ్వాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. 35 మంది ఉపాధ్యక్షులు, 75 మంది ప్రధాన కార్యదర్శులతో వారం రోజుల్లో జంబో కార్యవర్గాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. నామినేటెడ్ పదవిలో ఉన్నవారు పార్టీ పదవి కావాలనుకుంటే తమ పదవికి రాజీనామా చేయాలనే రూల్ పెట్టినట్లు టాక్. కార్యవర్గ కూర్పుపై చర్చించేందుకు బుధవారం ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో టీపీసీసీ చీఫ్ భేటీ కానున్నారు.