రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రెండు కొత్త పథకాలు ప్రారంభం

తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి కానుకగా దివ్యాంగులు, వృద్ధుల కోసం 'ప్రణామం' పథకాన్ని, పిల్లల కోసం 'బాల భరోసా' పథకాన్ని జనవరి 12న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ప్రణామం పథకం కింద దివ్యాంగులకు రూ.50 కోట్లతో వీల్ చైర్లు, స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, మోటరైజ్డ్ వాహనాలు వంటివి అందించనున్నారు. 7 వేల మంది దివ్యాంగులను ఎంపిక చేశారు. వృద్ధుల కోసం డే కేర్ సెంటర్లు ఏర్పాటు చేసి, వారికి లైబ్రరీ, ఇండోర్ గేమ్స్, టీవీ, ఇంటర్నెట్, పోషకాహారం అందిస్తారు. ఒక్కో సెంటర్‌కు రూ.12.48 లక్షలు ఖర్చు చేయనున్నారు.

సంబంధిత పోస్ట్