రైలులో గుండెపోటుతో మహిళ మృతి

భర్తతో కలిసి సొంతూరుకు వెళ్లేందుకు రైలు ఎక్కిన ఓ మహిళ గుండెపోటుతో మృతి చెందారు. జగిత్యాల జిల్లా గుల్లకోటకు చెందిన లక్ష్మణ్, రమాదేవి(43) దంపతులు. వీరు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డు ప్రాంతంలో వంట పని చేస్తుంటారు. మంచిర్యాలకు వెళ్లేందుకు సోమవారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కు చేరుకుని భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ ఎక్కారు. బోగీలో రమాదేవికి గుండెపోటు రావడంతో కుప్పకూలి పడిపోయారు. భర్త పోలీసుల సహకారంతో ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మంగళవారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

సంబంధిత పోస్ట్