ఆత్మహత్యాయత్నం చేసుకున్న యువతిని కాపాడిన 108 సిబ్బంది

శామీర్ పెట్ మండలం మజీద్ పూర్ కు చెందిన మంజుల నరసింహుల దంపతుల కుమార్తె రొండ్ల భావన (18) సోమవారం  సాయంత్రం ఉరివేసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేసింది. తల్లితండ్రులు చూసి 108 అంబులెన్సుకు సమాచారం అందించగా శామీర్ పెట్ అంబులెన్సు సిబ్బంది ఈఎంటి యాదమ్మ, పైలట్ శాంతి కుమార్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని డాక్టర్ చక్రవర్తి సూచనల మేరకు ప్రథమ చికిత్స అందిస్తూ దగ్గరలో ఉన్న హాస్పిటల్ కు తరలించారు. సమయానికి చేరుకొని భావనను కాపాడినందుకు బాధితురాలి తల్లిదండ్రులు ఈఎంటి యాదమ్మను, పైలట్ శాంతి కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕