హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్టలో ఓ మద్యం షాప్ సమీపంలోని చెత్తకుప్పలో ఓ వ్యక్తి మృతదేహం కలకలం సృష్టించింది. స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతుడిని ఎల్లమ్మబండ ఎన్టీఆర్ నగర్‌కు చెందిన రుస్తుం (43)గా గుర్తించారు. రుస్తుం పెయింటర్‌గా పనిచేస్తున్నాడని, మద్యం మత్తులో చెత్తకుప్పలో పడి మృతి చెంది ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.