మేడ్చల్ లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

హైదరాబాద్, మల్కాజ్‌గిరి, మేడ్చల్ పరిధిలోని రేకుల బావి చౌరస్తా సమీపంలో బుధవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతుడి గుర్తింపు పత్రాలు, ఇతర ఆధారాల కోసం పోలీసులు గాలిస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించి, మృతుడి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

సంబంధిత పోస్ట్

✕
✕