ఎల్లంపేట్ మున్సిపల్ పరిధిలోని డబిల్పూర్ లో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎల్లంపేట్ మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ ఎర్రవల్లి విఘ్నేశ్వర్ రెడ్డి, మాజీ సర్పంచ్ సంజీవరావు హాజరై ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ చేసిన సేవలు, సాహసాలను కొనియాడారు. దొరల అరాచకాలకు, నిజాం రజాకార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఆమె సాగించిన పోరాటం స్ఫూర్తిదాయకమని అన్నారు. శ్రీరామ్ రెడ్డి, వెంకటేష్ యాదవ్, బేగారి సురేష్, ఇమ్రాన్, శేఖర్, అశోక్, రాజు, నరసింహ, శ్రీనివాస్ పాల్గొన్నారు.