మేడ్చల్ స్టేషన్ రోడ్డులో ప్రమాదకరంగా డ్రైనేజీ గుంతలు

మేడ్చల్ స్టేషన్ రోడ్డులో మూతలు లేకుండా వదిలేసిన సుమారు 8అడుగుల లోతైన డ్రైనేజీ గుంతలు ప్రజలకు ప్రమాదకరంగా మారింది. వర్షపు నీటితో గుంతలు కనిపించకపోవడంతో ద్విచక్ర వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానికులు తాత్కాలికంగా హెచ్చరిక గుర్తులు ఏర్పాటు చేసినప్పటికీ అధికారులు ఇప్పటికీ చర్యలు చేపట్టలేదు. ప్రమాదం జరగకముందే డ్రైనేజీకి మూతలు ఏర్పాటు చేసి రోడ్డును మరమ్మతు చేయాలని ప్రజలు కోరుతున్నారు. స్థానికులు మాట్లాడుతూ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకునే నాధుడులేదని వాపోయారు. ప్రమాదం జరిగినప్పుడు తాత్కాలికంగా మరమ్మతులు చేస్తారని తెలిపారు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు

సంబంధిత పోస్ట్