కాంగ్రెస్ నాయకుడి సమక్షంలో అన్నప్రసాద వితరణ

హైదరాబాద్, ఉప్పల్, మల్కాజ్‌గిరిలోని కాప్రా, గణేష్‌ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏఎస్‌ రావు నగర్‌ డివిజన్‌ జమ్మిగడ్డ సాయిలోక్‌ కాలనీలో శనివారం సాయిలోక్‌ కాలనీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఎస్‌ రావు నగర్‌ డివిజన్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేశెట్టి ప్రసాద్‌ పాల్గొని భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. సీనియర్‌ నాయకులు కొత్త అంజిరెడ్డి, పాకాల రాజు, అల్లూరయ్య, తాళ్లపల్లి మేఘరాజ్‌, భద్రగామ నరసింహ, సింగం కిరణ్‌, ప్రభాకర్‌, కాలనీ అసోసియేషన్‌ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕