లోక్సభలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం, దేశంలో 91.7% రైతు కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. ఒక్కో రైతు కుటుంబంపై సగటున రూ.1,52,113 అప్పు భారం ఉంది. రైతు కుటుంబాల నెలవారీ సగటు ఆదాయం కేవలం రూ.9,403 మాత్రమే, ఇది దేశ సగటు ఆదాయం రూ.10,218 కంటే తక్కువ. ఈ గణాంకాలను కేంద్ర వ్యవసాయశాఖ సహాయ మంత్రి రామ్నాథ్ ఠాకూర్, సిచ్యుయేషన్ ఎసెస్మెంట్ సర్వే 2018-19 ఆధారంగా వెల్లడించారు.