మేడారం జాతరలో భక్తుల భారీ ఖర్చు: రూ.1000 కోట్లు దాటిన అంచనా

నాలుగు రోజుల పాటు వైభవంగా జరిగిన మేడారం జాతరలో భక్తులు సుమారు రూ.1,000 కోట్లు ఖర్చు చేసినట్లు అంచనా. కోటిన్నర మంది భక్తులు 14 లక్షల గొర్రెలు, మేకలు, కోళ్లను బలిచ్చినట్లు తెలుస్తోంది. మద్యం కోసం రూ.10 కోట్లు, మాంసం, మద్యం కలిపి రూ.400 కోట్లు వెచ్చించినట్లు సమాచారం. అలాగే కోటికి పైగా కొబ్బరికాయలు, 500 టన్నుల బెల్లం, చీరె, సారె, గాజులు వంటి వాటితో పెద్దఎత్తున వ్యాపారం జరిగింది.

సంబంధిత పోస్ట్