హైదరాబాద్: టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. ఒకప్పుడు సినిమాలు, సీరియల్స్‌లో కీలక పాత్రలలో నటించి గుర్తింపు తెచ్చుకున్న నటి జనవాహిని కన్నుమూశారు. హైదరాబాద్ మణికొండలోని తన నివాసంలో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. కొంతకాలంగా క్యాన్సర్‌తోనే పోరాడుతున్న ఆమె ఆరోగ్యం క్షీణించడంతో మృతిచెందినట్లు తెలుస్తోంది. ఆమె మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.