ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని కోర్రెముల సుప్రభాత్ టౌన్షిప్లో డెమొక్రటిక్ సీనియర్ సిటీజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్, సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వయో వృద్ధులైన రాసకట్ల పోషం, బంగారు మల్లయ్య, ఎం. సత్యనారాయణ లను శాలువాలతో సత్కరించి, కేక్ కోసి ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆళవందార్ వేణు మాధవ్ మాట్లాడుతూ వృద్ధుల హక్కుల పరిరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.