కొండా లక్ష్మణ్ బాపూజి ఆశయాలు స్ఫూర్తిదాయకం: రవి రాజ్ రాథోడ్

మేడ్చల్ లో కొండా లక్ష్మణ్ బాపూ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి జనసేన నాయకుడు, న్యాయవాది రవి రాజ్ రాథోడ్ పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధన, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం కొండా లక్ష్మణ్ బాపూ చేసిన పోరాటం చిరస్మరణీయమని ఆయన ఆశయాలను నేటి తరం ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని రవి రాజ్ రాథోడ్ పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల హక్కులు, ఆత్మగౌరవం కోసం ఆయన చేసిన సేవలు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕