కుషాయిగూడ: స్కూలు బస్సు ఢీకొని విద్యార్థికి గాయాలు

కుషాయిగూడలోని అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ సమీపంలో అదే స్కూల్ బస్సు ఢీకొని విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల వివరాలిలా.. కుషాయిగూడ సుభాష్ చంద్రనగర్ కాలనీకి చెందిన చైతన్య గోపిశెట్టి ఇదే పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. సైకిల్పై స్కూలుకు వస్తుండగా శుక్రవారం బస్సు ఢీ కొట్టడంతో చెయ్యి నుజ్జు నుజ్జుయ్యింది. దీంతో బాలుడిని యశోద ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్