మల్కాజ్ గిరి నియోజకవర్గ సమస్యలపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ను మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కలిశారు. పలు ప్రాంతాలలో యూపీహెచ్సీ లో ఆరోగ్య కేంద్రాల నిర్మాణం, మచ్చ బొల్లారంలో హిందూ శ్మశానవాటిక పరిరక్షణ, బాక్స్ డ్రైన్ నిర్మాణం, అల్వాల్ డివిజన్ లో నూతన అగ్నిమాపక కేంద్రం నిర్మాణాన్ని ప్రతిపాదించారు.