డబిల్‌పూర్ రైల్వే స్టేషన్ వద్ద రైలు కింద పడి వ్యక్తి మృతి

మేడ్చల్ - మల్కాజ్ గిరి జిల్లా ఎల్లంపేట్ మున్సిపల్ పరిధిలోని డబిల్‌పూర్ రైల్వే స్టేషన్ వద్ద విషాద ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తి రైలు కింద పడి మృతి చెందినట్లు సమాచారం. మృతుడికి సంబంధించిన బైక్‌ సంఘటనా స్థలానికి సమీపంలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనను గమనించిన స్థానికులు సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. మృతుడి వివరాలు, ఘటనకు గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕