మేడ్చల్ డ్రైనేజీ పనులు: రోడ్లు గుంతలమయం, ప్రజల ఆవేదన

మేడ్చల్ డివిజన్ పరిధిలోని ఇంద్రనగర్ కాలనీలో సెంట్రల్ లైన్ డ్రైనేజీ పనులు పూర్తయినా, రహదారిని తిరిగి పునరుద్ధరించకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ గుంతలు, బురద, నీటి నిల్వలు ఏర్పడి వాహనదారులు, పాదచారులు ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణించాల్సి వస్తోంది. వర్షాలు కురిస్తే రోడ్డు బురదమయంగా మారి ద్విచక్ర వాహనాలు జారిపడే ప్రమాదం పెరుగుతోంది. అత్యవసర వాహనాలు కూడా సకాలంలో చేరలేని పరిస్థితి నెలకొందని బుధవారం కాలనీవాసులు తెలిపారు. ఈ సమస్యపై అధికారులు స్పందించాలని వారు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్