ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ మీన్ రెడ్డి

మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని మౌలాలిలో కుషాయిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుట సింగిరెడ్డి మీన్ రెడ్డి (32) అనే వ్యక్తి డ్రంక్ అండ్ డ్రైవ్ లో పోలీసులు వ్యవహరించిన తీరుపై మనస్తాపంతో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని బంధువులు ఆరోపిస్తున్నారు. నిన్న అర్ధరాత్రి సుమారు రెండు గంటలకు ఈ సంఘటన జరిగినట్లు సమాచారం. డ్రంక్ అండ్ డ్రైవ్ లో 120 వచ్చిందని కుషాయిగూడ ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నట్లు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్