హైదరాబాద్‌లోని కీసర పోలీస్‌స్టేషన్ పరిధిలోని నాగారం విజయపురి కాలనీలో నవజాత మగ శిశువు మృతదేహం లభ్యం కావడంతో స్థానికంగా కలకలం రేగింది. ధోబీఘాట్ సమీపంలో తెలుపు రంగు కవర్లో శిశువు మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించగా, శిశువు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కీసర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.