రామంతాపూర్: అప్పుడే పుట్టిన పసికందును పడేసి వెళ్లిన తల్లి

ఉప్పల్ పరిధి రామంతాపూర్ పరిధిలోని వివేక్ నగర్ సమీపంలో శనివారం దారుణ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు. గుర్తు తెలియని ఓ మహిళ తనకు పుట్టిన ఓ పసికందును రోడ్డు పక్కన పడేసి వెళ్ళిపోయింది. శిశువు ఏడుపు విన్న స్థానికులు వెళ్లి చూసి నాగోల్ లోని 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు. టెక్నీషియన్ యాదగిరి, పైలట్ ప్రణయ్ శిశువుకు ప్రథమ చికిత్స అందించి ఉప్పల్ పోలీసుల సాయంతో నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్