ప్రపంచ ఫార్మసీ డే సందర్భంగా ఘట్ కేసర్ సర్కిల్ పోచారం మున్సిపాలిటీ పరిధిలోని వెంకటాద్రి టౌన్ షిప్ చౌదరిగూడలో మెడిప్లస్ ఫార్మసీ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న కె. శిరీష, కె. హర్షితలను సమాజానికి అందిస్తున్న సేవలను గుర్తించి సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. వారికి శాలువాలు కప్పి పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆళవందార్ వేణు మాధవ్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య సంరక్షణలో ఫార్మాసిస్టుల పాత్ర ఎంతో కీలకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీరయ్య, ప్రభాకర్, రాజనర్సు, సత్యనారాయణ, నర్సయ్య, కె. మల్లయ్య పాల్గొన్నారు.