పర్యావరణ పరిరక్షణలో ఆదర్శంగా సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులు

ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని కొర్రెముల సుప్రభాత్ టౌన్‌షిప్‌లో గణేష్ నవరాత్రుల సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులు పర్యావరణానికి హాని కలిగించే సింగిల్ యూజ్ ప్లాస్టిక్, పేపర్ గ్లాసులు, ప్లాస్టిక్ ప్లేట్లను ఉపయోగించకుండా, తమ ఇళ్ల నుంచే స్టీల్ ప్లేట్లు, స్టీల్ గ్లాసులు తీసుకువచ్చి అన్నదానం, తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఆదర్శంగా నిలిచారు. ఈ కార్యక్రమంలో సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆళవందార్ వేణుమాధవ్, బంగారి రాజయ్య, కొట్టే మల్లయ్య, కంచె బీరయ్య, ప్రభాకర్, ప్రకాష్ రావ్, లక్ష్మీ నారాయణ, రాజా నర్సు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕