మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా జవహర్‌నగర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. అదనపు కట్నం కోసం సొంత అక్క, బావ, వారి కుటుంబ సభ్యుల వేధింపులు తట్టుకోలేక నవీన్ (29) అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అక్క రెండో వివాహ సమయంలో కట్నకానుకలు ఇచ్చినప్పటికీ మరింత కట్నం కావాలని నవీన్ కుటుంబాన్ని వేధించారు. ‘కట్నం ఇవ్వలేనివాడివి బతకడం ఎందుకు?’ అంటూ అవమానించడంతో పాటు ఖాళీ చెక్కులపై సంతకాలు చేయించుకున్నారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన నవీన్ శనివారం తాను పనిచేస్తున్న గోదాంలో ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.