మల్కాజిగిరి జిల్లా బార్ అసోసియేషన్‌లో సోమవారం భగత్ సింగ్ జయంతి సందర్భంగా జనసేన నాయకుడు, న్యాయవాది రవి రాజ్ రాథోడ్ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. భగత్ సింగ్ త్యాగాలను స్మరించుకుంటూ, ఆయన ఆశయాలను ఆచరిస్తూ దేశ, సమాజ సేవలో యువత ముందుకు రావాలని రాథోడ్ పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై స్పందిస్తూ బాధ్యతాయుతంగా పనిచేసే యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది మురళి నాయక్, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.