నకిలీ వైద్యుడి ఇంజెక్షన్‌తో వ్యక్తి మృతి

మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ వైద్యుడి చికిత్సతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. పీర్జాదిగూడకు చెందిన పెండ ఎల్లం (56)కు ఈనెల 26న రాత్రి తీవ్ర జ్వరం రావడంతో, నకిలీ వైద్యుడు రూప్ సింగ్ వద్ద ఇంజెక్షన్లు తీసుకున్నారు. దీంతో నోటి నుంచి నురగ రావడం ప్రారంభమైంది. ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. కుమారుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టి, రూప్ సింగ్ నకిలీ వైద్యుడని తేలడంతో అతడిని రిమాండ్‌కు తరలించారు.

సంబంధిత పోస్ట్