సికింద్రాబాద్ మహంకాళి గుడిలో భారీగా నగలు చోరీ

సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్ లోని మహంకాళి ఆలయంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఆలయ తాళాలు పగులగొట్టి లోపలికి చొరబడిన దొంగలు, అమ్మవారి బంగారు, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. సుమారు కేజీ మేర వెండి, బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. సమాచారం అందుకున్న గోపాలపురం పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల ఆధారంగా దొంగను పట్టుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.

సంబంధిత పోస్ట్