బోడుప్పల్ లోని దేవేందర్ నగర్‌లో శనివారం రాత్రి దారుణ ఘటన..

మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి బోడుప్పల్ లోని దేవేందర్ నగర్‌లో శనివారం రాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది. కొత్త ఇంటి గృహప్రవేశ కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఓ గ్యాంగ్ ఇంట్లోకి చొరబడి కుటుంబ సభ్యులు, బంధువులపై విచక్షణ లేకుండా దాడి చేసింది. ఈ దాడిలో వృద్ధులు, మహిళలు, పిల్లలు గాయపడ్డారు. బాధితులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గృహ ప్రవేశానికి వస్తున్న ఇంటి ప్రక్కనే ఉన్న ఓ రిపోర్టర్ ఈ సంఘటన సోషల్ మీడియాలో వేసినందుకు గాను రిపోర్టర్ కారును ధ్వంసం చేసి, ఇంటిపై దాడికి యత్నించారు.

సంబంధిత పోస్ట్