కీసర పోలీస్ స్టేషన్ నూతన సీఐగా అర్వపల్లి ఆంజనేయులు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం శాంతి భద్రతలపై రాజీ లేకుండా పనిచేస్తానని, ప్రజల రక్షణే ధ్యేయమన్నారు. ఈ సందర్భంగా ఎన్‌బీఎంఐ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు రవి రాజ్ రాథోడ్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ నాను నాయక్, ఇతరులు పాల్గొన్నారు.