హైదరాబాద్‌లోని ప్రగతినగర్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం విద్యార్థినిపై అదే కళాశాలకు చెందిన మరో విద్యార్థి అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు, తనకు మత్తుచాక్లెట్ ఇచ్చి క్లాస్‌రూమ్‌లోనే అత్యాచారం చేశారని, ప్రేమ పేరుతో నమ్మించి ఓయో రూమ్‌లోనూ వేధించారని పేర్కొంది. ఈ ఘటనపై పోలీసులు విద్యార్థిని, నిందితుడు, కళాశాల మెకానికల్ డిపార్ట్‌మెంట్ హెడ్‌పై కేసులు నమోదు చేశారు.