మహిళా సాధికారతకు ఎల్లప్పుడూ ప్రాధాన్యం ఇస్తూ భారతీయ జనతా పార్టీ మహిళలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లే దిశగా కృషి చేస్తున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్ర మహిళా మోర్చా ఆఫీస్ సెక్రటరీగా నియమితులైన సంతోషి గిరిజ ని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీపీ, మేడ్చల్ నియోజకవర్గం బీజేపీ ఇంచార్జ్ ఏనుగు సుదర్శన్ రెడ్డి ఘట్కేసర్ లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళలకు రాజకీయాల్లో సముచిత స్థానం కల్పించడం బీజేపీ లక్ష్యమని, సంతోషి గిరిజ వంటి మహిళా నాయకులు పార్టీ బలోపేతానికి కీలక పాత్ర పోషిస్తారని అన్నారు.