చేపలు పట్టేందుకు వెళ్లి బాలుడి దుర్మరణం

బాచుపల్లి రాజీవ్ గాంధీ నగర్లో నివాసముంటున్న శ్రీనివాస్, దేవి దంపతుల కుమారుడు సాయి చరణ్ (13), స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. ఆదివారం తన ముగ్గురు స్నేహితులతో కలిసి బాచుపల్లిలోని ఖైరుని చెరువు వద్దకు చేపలు పట్టడానికి వెళ్ళాడు. చేపలు పడుతుండగా బండరాయిపై నుండి జారి చెరువులో పడిపోయాడు. అతని స్నేహితులు భయపడి రోడ్డుపైకి వచ్చి, అటుగా వెళ్తున్న డెలివరీ బాయ్ ద్వారా డయల్ 100కు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాలుడి మృతదేహాన్ని వెలికితీశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్