నేషనల్ బంజారా మిషన్ ఇండియా (NBMI) మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షుడు రవి రాజ్ రాథోడ్, తెలంగాణ రాష్ట్ర నూతన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా సి.వి ఆనంద్ నియమితులైన సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. సీవీ ఆనంద్ సమర్థవంతమైన, క్రమశిక్షణ కలిగిన, ప్రజలకు చేరువైన ఉన్నతాధికారిగా మంచి పేరు సంపాదించారని, ఆయన నాయకత్వంలో తెలంగాణ పోలీస్ శాఖ మరింత సమర్థవంతంగా పనిచేస్తుందని రవి రాజ్ రాథోడ్ పేర్కొన్నారు. ఈ నియామకం హైదరాబాద్, మేడ్చల్ ప్రాంతాలకు సంబంధించినది.