స్వీయ జనగణనలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి: కలెక్టర్ మను చౌదరి

మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి, జనాభా లెక్కల స్వీయ గణన-2027 కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాల్గొని తమ కుటుంబ వివరాలను స్వయంగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఆదివారం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ, ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు స్వీయ గణన ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ప్రజలు https://se.census.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి Self Enumeration (HLO) Login ఎంపిక చేసుకుని తెలంగాణను సెలెక్ట్ చేసి క్యాప్చా నమోదు చేసుకుని ముందుకు వెళ్లాలని సూచించారు.

సంబంధిత పోస్ట్