శుక్రవారం యన్నం పేటలో గ్లాస్ కంపెనీ నిర్వహిస్తున్న వనమాల గిరీష్ కుమార్, అనిత దంపతులు ఇంట్లోంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా వారి ఆచూకీ లభించలేదు. శనివారం గిరీష్ కుమార్ సోదరుడు హరీష్ కుమార్ ఫిర్యాదు మేరకు పోచారం ఐటీ కారిడార్ ఎస్సై నాగేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.