భార్య విధులకు వెళ్లగా భర్త ఆత్మహత్య

మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భార్య విధులకు వెళ్ళిన సమయంలో భర్త గౌతమ్ (27) ఆత్మహత్య చేసుకున్నాడు. రామంతాపూర్ కు చెందిన గౌతమ్, బోడుప్పల్ కు చెందిన సుమలతను రెండేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. ఆరు నెలలుగా పీర్జాదిగూడ గాయత్రి నగర్ లో నివసిస్తున్నారు. ఈ నెల 1న సుమలత విధులకు వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేసరికి, లోపలి నుంచి తలుపులు మూసి ఉన్నాయి. కిటికీలోంచి చూడగా గౌతమ్ ఉరేసుకుని కనిపించాడు. సుమలత పోలీసులకు ఫిర్యాదు చేసింది.

సంబంధిత పోస్ట్