రంగారెడ్డి: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జూనియర్ అసిస్టెంట్

చంపాపేట్‌లోని సంతోష్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ జోన్ విద్యాశాఖ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న శివప్రసాద్‌ను రూ. 10,000 లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాన్ని బెదిరించి, వారి 10వ తరగతి పరీక్షా కేంద్రాన్ని రద్దు చేస్తానని చెప్పి లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. పాఠశాల యాజమాన్యం ఏసీబీను ఆశ్రయించడంతో అధికారులు ముందస్తు ప్రణాళికతో వచ్చి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఏసీబీ డీఎస్పీ గంగాసాని శ్రీధర్ మాట్లాడుతూ, నిందితుడిని ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని, ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతికి తావులేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లంచం డిమాండ్ చేసే అధికారులపై ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు.

సంబంధిత పోస్ట్