హైదరాబాద్ నగర శివారులోని ఘట్కేసర్ - బోడుప్పల్ హైవేపై అర్ధరాత్రి పెళ్లి ముగించుకొని కారులో తిరిగి వెళ్తున్న కుటుంబాన్ని బైక్పై వెంబడించి పోకిరీలు భయాందోళనలకు గురిచేశారు. కారులో మహిళలు, చిన్నారులు ఉన్నారని గమనించినా ఆకతాయిలు అడ్డంగా బైక్ను పోనిస్తూ, అసభ్యంగా కేకలు వేస్తూ వీరంగం సృష్టించారు. ఈ ఘటన కారు డ్యాష్ క్యామ్లో రికార్డ్ అయింది. బాధితురాలు వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. నగరంలో శాంతిభద్రతలు క్షీణించాయని, అధికారుల నిఘా లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.