హైదరాబాద్: రైల్లో మహిళకు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు

చర్లపల్లి నుంచి హౌరాకు వెళ్తున్న ఈస్ట్ కోస్ట్ రైల్లో కోల్‌కతాకు చెందిన పింకీ సాహా (31) అనే మహిళా ప్రయాణికురాలు బుధవారం తీవ్ర అస్వస్థతకు గురైంది. హైదరాబాద్ నుంచి తిరుగు ప్రయాణంలో ఉన్న ఆమెకు కడుపునొప్పి, ఆయాసం రావడంతో కుటుంబ సభ్యులు రైలు టీటీకి సమాచారం అందించారు. రైల్వే అధికారుల ఆదేశాల మేరకు కాజీపేటలో రైలు ఆగగానే 108 సిబ్బంది పింకీకి ప్రథమ చికిత్స చేసి, పరిస్థితి విషమించడంతో వరంగల్‌లోని ఎంజీఎం దావఖానకు తరలించారు.

సంబంధిత పోస్ట్